CSK చేతిలో పంజాబ్ చిత్తు.. రెండు ఇంటికే?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 53వ మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. 9 వికెట్ల భారీ తేడాతో పంజాబ్‌ను చిత్తుచేసింది. వరుసగా మూడు విజయాలు సాధించి ఈ సీజన్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ కొట్టింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలోనే టార్గెట్‌ను రీచ్ చేసింది. ఈ మ్యాచ్ ఓటమితో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కూడా ప్లే ఆఫ్స్ ఆశలను కోల్పోయింది. ఇన్నింగ్స్ సాగిందిలా.. ఓపెనర్ ఫాఫ్ డూ ప్లెసిస్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 53వ మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. 9 వికెట్ల భారీ తేడాతో పంజాబ్‌ను చిత్తుచేసింది. వరుసగా మూడు విజయాలు సాధించి ఈ సీజన్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ కొట్టింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలోనే టార్గెట్‌ను రీచ్ చేసింది. ఈ మ్యాచ్ ఓటమితో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కూడా ప్లే ఆఫ్స్ ఆశలను కోల్పోయింది.
ఇన్నింగ్స్ సాగిందిలా..
ఓపెనర్ ఫాఫ్ డూ ప్లెసిస్ (48) పరుగులతో రాణించాడు. ఇక ఓపెనింగ్‌లోనే స్ట్రైక్‌లో దిగిన రుతురాజ్ గైక్వాడ్ తొలి నుంచి నిలకడగా రాణిస్తూ.. 49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అంబటి రాయుడు కూడా బాల్ టు బాల్ ఆడుతూ 30 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంతో చెన్నై విజయం లాంఛనమైంది.
పంజాబ్ ఇన్నింగ్స్:
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 113 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టుకు.. మిడిలార్డర్‌లో వచ్చిన దీపక్ హుడా (62) 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును 153కు తీసుకొచ్చాడు. తొలుత ఓపెనింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ (29), మయాంక్ అగర్వాల్ (26) పరుగులతో కాసేపు క్రీజులో ఉండి వెనుదిరగడంతో స్కోరు కాస్త తగ్గింది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన క్రిస్ గేల్ (12), మిడిలార్డర్‌లో వచ్చిన నికోలస్ పూరన్(2) పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మందీప్ సింగ్ (14), జేమ్స్ నిషమ్ (2) పరుగులు చేసి మైదానం వీడగా.. దీపక్ హుడా 62 పరుగులతో జట్టు భారాన్ని మీదేసుకొచ్చి చివరి వరకు ఆడుతూ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో స్కోరు 153కు చేరింది.
స్కోర్‌బోర్డ్:
Kings XI Punjab Innings: 153-6 (20 Ov)
1. కేఎల్ రాహుల్ (c) (wk)b లుంగి ఎంగిడి 29(27)
2. మయాంక్ అగర్వాల్ b లుంగి ఎంగిడి 26(15)
3. క్రిస్ గేల్ lbw b తాహీర్ 12(19)
4. నికోలస్ పూరన్ c ధోని b ఠాకూర్ 2(6)
5. మందీప్ సింగ్ b రవీంద్ర జడేజా 14(15)
6. దీపక్ చాహర్ నాటౌట్ 62(30)
7. జేమ్స్ నిషమ్ c రుతురాజ్ గైక్వాడ్ b లుండి ఎంగిడి 2(3)
8. క్రిస్ జోర్డన్ 4(5)
ఎక్స్‌ట్రాలు: 2
మొత్తం స్కోరు: 153-6
వికెట్ల పతనం: 48-1 (మయాంక్ అగర్వాల్, 5.2), 62-2 (కేఎల్ రాహుల్, 8.3), 68-3 (నికోలస్ పూరన్, 10.4), 72-4 (క్రిస్ గేల్, 11.5), 108-5 (మందీప్ సింగ్, 16.2), 113-6 (జేమ్స్ నిషమ్, 17.1).
బౌలింగ్:
1. దీపక్ చాహర్ 3-0-30-0
2. శామ్ కర్రన్ 2-0-15-0
3. శార్దుల్ ఠాకూర్ 4-0-27-1
4. లుండి ఎంగిడి 4-0-39-3
5. ఇమ్రాన్ తాహీర్ 4-0-24-1
6. రవీంద్ర జడేజా 3-0-17-1
Chennai Super Kings Innings: 154-1 (18.5 Ov)
1. రుతురాజ్ గైక్వాడ్ నాటౌట్ 62(49)
2. ఫాఫ్ డూ ప్లెసిస్ c రాహుల్ చాహర్ b క్రిస్ జోర్డన్ 48(34)
3. అంబటి రాయుడు నాటౌట్ 30(30)
ఎక్స్‌ట్రాలు: 154
మొత్తం స్కోరు: 154
వికెట్ల పతనం: 82-1 (ఫాఫ్ డూ ప్లెసిస్, 9.5).
బౌలింగ్:
1. జేమ్స్ నిషమ్ 3-0-26-0
2. మహ్మద్ షమీ 4-0-29-0
3. క్రిస్ జోర్డన్ 3-0-31-1
4. రవి భిష్నోయ్ 4-0-39-0
5. మురుగన్ అశ్విన్ 4-0-17-0
6. క్రిస్ గేల్ 0.5-0-5-0