విజిల్ పోడు.. సీఎస్కే భారీ స్కోర్.. ముంబై గెలిచేనా..?
దిశ, వెబ్‌డెస్క్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై.. బ్యాక్ టు ఫామ్ అంటూ సీఎస్కే భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సీఎస్కేలో ముఖ్యంగా అంబటి రాయుడు ముంబై బౌలర్లపై చెలరేగి ఆడాడు. కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4) నిరాశ పరిచాడు. ఫాఫ్ డు ప్లెసిస్ (50), మెయిన్ […]
దిశ, వెబ్‌డెస్క్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై.. బ్యాక్ టు ఫామ్ అంటూ సీఎస్కే భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సీఎస్కేలో ముఖ్యంగా అంబటి రాయుడు ముంబై బౌలర్లపై చెలరేగి ఆడాడు. కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4) నిరాశ పరిచాడు. ఫాఫ్ డు ప్లెసిస్ (50), మెయిన్ అలీ (56) పరుగులతో హాఫ్ సెంచరీలు చేసి తమ వంతు కృషి చేశారు. ఆ తర్వాత సురేష్ రైనా (2) పరుగులకే పెవిలియన్ చేరినా.. రాయుడికి తోడుగా రవీంద్ర జడేజా చివరి వరకు నిలబడి 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.