కమలం ఓ వాడిపోతున్న పువ్వు.. కేసీఆర్‌ను వీడితే ఎవరైనా కనుమరుగే..!
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీని కాదని వెళ్లిన వారు కనుమరుగయ్యారని.. ఈటల కూడా అదే బాటలో పయనిస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటలది ఆత్మగౌరవ పోరాటం కాదని.. కేవలం ఆయనది అస్తిత్వ పోరాటమే అన్నారు. ఆస్తులను కాపాడుకోవడం ఆరాటపడుతున్నాడని ఆరోపించారు. బీజేపీలో ఈటల చేరడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని, […]
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీని కాదని వెళ్లిన వారు కనుమరుగయ్యారని.. ఈటల కూడా అదే బాటలో పయనిస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటలది ఆత్మగౌరవ పోరాటం కాదని.. కేవలం ఆయనది అస్తిత్వ పోరాటమే అన్నారు. ఆస్తులను కాపాడుకోవడం ఆరాటపడుతున్నాడని ఆరోపించారు. బీజేపీలో ఈటల చేరడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని, ఆయన వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్నారన్నారు. టీఆర్ఎస్‌లో చిన్నచిన్న సమస్యలు రావడం సహజమని.. కూర్చొని పరిష్కరించుకుంటే పరిష్కారం అయ్యేవన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులకిచ్చే గౌరవం అపారమైందని, సమస్యలు విన్నవించుకుందామని వెళితే భోజనం చేసిన తర్వాతే సావధానంగా విని పరిష్కరించేవారన్నారు. పార్టీలో ఈటలకు ఇచ్చిన గౌరవం మరెవరికీ ఇవ్వలేదన్నారు. ఈటలకు గుర్తింపు నివ్వడంతో పాటు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి మంత్రి పదవులు అన్నీ కేసీఆర్ ఇచ్చినవే అని గుర్తుంచుకోవాలన్నారు. ఆరేండ్ల క్రితమే ఈటల బీజేపీలో చేరేందుకు స్క్రిప్ట్ రాసుకున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరినందుకు ఈటల ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర సమక్షంలో చేరిన ఈటల పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని బీజేపీని అడుగకపోవడంలో ఉన్న ఆంతర్యమేంటనీ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఎవరితరం కాదని, వెయ్యి మంది ఈటల, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్‌లు వచ్చినా టీఆర్ఎస్‌ను ఏం చేయలేరు. ఇంకా వందేళ్లు టీఆర్ఎస్ సుస్థిరంగా ఉంటుందని జోస్యం చెప్పారు.
తెలంగాణ శత్రువు బీజేపీ..
తెలంగాణకు శత్రువు బీజేపీ అని ఎమ్మెల్సీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ పై పగబట్టింది కనుకే కేసీఆర్ పై కక్ష తీర్చుకోవడానికి ఈటల ఆ పార్టీలో చేరారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ పై అయిష్టతతోనే ఈటల బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. బీజేపీకి మత రాజకీయాలు తప్ప మరేమి చేతకాదన్నారు. విద్య, వైద్య రంగాలపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆయన వెంటే తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు.