సుప్రీం చీఫ్ జస్టిస్‌ను క‌లిసిన గిరిజన శాఖ మంత్రి

దిశ‌, మ‌హ‌బూబాబాద్ : భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్‌కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి రమణను రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమ‌వారం రాజ్ భవన్‌కు వెళ్లిన మంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనందుకు జస్టిస్ ఎన్వీ రమణకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. జస్టిస్ రమణ నేతృత్వంలో భారత న్యాయవ్యవస్థలో మంచి మార్పులు వస్తాయని సత్యవతి రాథోడ్ […]

Update: 2021-06-14 09:30 GMT

దిశ‌, మ‌హ‌బూబాబాద్ : భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్‌కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి రమణను రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమ‌వారం రాజ్ భవన్‌కు వెళ్లిన మంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనందుకు జస్టిస్ ఎన్వీ రమణకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. జస్టిస్ రమణ నేతృత్వంలో భారత న్యాయవ్యవస్థలో మంచి మార్పులు వస్తాయని సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు.

Tags:    

Similar News