ఇదో మెదడు తక్కువ దందా !
దిశ, క్రైమ్‌బ్యూరో: మెదడు వాపు వ్యాధికి చికిత్స చేయించాలంటూ నెటిజన్ల సానుభూతితో దందా చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ యంగ్ కరేజ్ పేరుతో ఫేస్బుక్ పేజీలో ఓ రోగికి వైద్య సాయం కావాలంటూ పోస్టు చూసినట్టుగా సల్మాన్ ఖాన్ చెప్పడంతో… మహమ్మద్ ఇమ్రాన్ స్పందించి తన ఖాతా నుంచి రోగి బంధువు అస్రా అకౌంట్‌కు రూ.59,700 లను […]
దిశ, క్రైమ్‌బ్యూరో: మెదడు వాపు వ్యాధికి చికిత్స చేయించాలంటూ నెటిజన్ల సానుభూతితో దందా చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ యంగ్ కరేజ్ పేరుతో ఫేస్బుక్ పేజీలో ఓ రోగికి వైద్య సాయం కావాలంటూ పోస్టు చూసినట్టుగా సల్మాన్ ఖాన్ చెప్పడంతో… మహమ్మద్ ఇమ్రాన్ స్పందించి తన ఖాతా నుంచి రోగి బంధువు అస్రా అకౌంట్‌కు రూ.59,700 లను ట్రాన్స్ఫర్ చేశాడు.
తాను సాయం చేసిన తర్వాత కూడా మళ్లీ సోషల్ మీడియాలో అస్రా పోస్టులను గమనించిన దాత ఇమ్రాన్.. రోగి యాస్మిన్‌ను వివరాలు అడిగి తెలుసుకోగా తనకు డబ్బులు చేరలేదని చెప్పాడు. వెంటనే తాను డబ్బు బదిలీ చేసిన ఎస్బీఐ అకౌంట్ స్టేట్మెంట్ వివరాలను గమనిచంగా మొత్తం రూ.15లక్షలు సేకరించినట్టుగా తెలిసింది. అంతేగాక ఈ సొమ్మును సల్మాన్ ఖాన్, అహ్మద్ ఖాతాలకు బదిలీ చేసినట్టుగా ఉంది. సల్మాన్‌ఖాన్, అస్రా బేగం, అహ్మద్‌లు వైద్య సాయం పేరిట నాటకం ఆడి సానుభూతిని సొమ్ము చేసుకుంటున్నట్టు ఇమ్రాన్ తెలుసుకొని పొలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.