రూ.కోటి నగదుతో పరారీ.. నిందితుడు అరెస్టు

దిశ, క్రైమ్ బ్యూరో : అనుమతి లేని చిట్టీలు నిర్వహిస్తూ రూ. కోటి నగదుతో పరారీలో ఉన్న వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సరూర్ నగర్‌కు చెందిన మునుగంటి హరినాథ్ గత 25 ఏళ్లుగా చిక్కడపల్లిలో ప్రింటింగ్ ఇంక్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చుట్టుపక్కల ఏరియాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహార్ నగర్, అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో అతనికి ఉన్న పరిచయాలతో అనుమతి లేని చిట్టీలను నిర్వహిస్తున్నాడు. అయితే, గత కొద్ది కాలంగా చిట్టీ డబ్బులు […]

Update: 2020-11-23 11:19 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : అనుమతి లేని చిట్టీలు నిర్వహిస్తూ రూ. కోటి నగదుతో పరారీలో ఉన్న వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సరూర్ నగర్‌కు చెందిన మునుగంటి హరినాథ్ గత 25 ఏళ్లుగా చిక్కడపల్లిలో ప్రింటింగ్ ఇంక్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చుట్టుపక్కల ఏరియాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహార్ నగర్, అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో అతనికి ఉన్న పరిచయాలతో అనుమతి లేని చిట్టీలను నిర్వహిస్తున్నాడు.

అయితే, గత కొద్ది కాలంగా చిట్టీ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మొబైల్ ఫోన్‌ కూడా ఆఫ్ చేశాడు. దీంతో అశోక్ నగర్, జవహార్ నగర్‌కు చెందిన వై.రాజేశ్వర రావు సెప్టెంబరు 21న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మునుగంటి హరినాథ్‌ను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా రూ.కోటి నగదును కాజేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో సోమవారం అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags:    

Similar News