గంజాయి రహిత సమాజ నిర్మాణం చేద్దాం: డీసీపీ గజారావు భూపాల్
దిశ, చార్మినార్: గంజాయి రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని డీసీపీ గజారావు భూపాల్ అన్నారు. ప్రజలందరూ సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని సూచించారు. పోలీసులు కార్డన్ సెర్చ్ కి కమ్యూనిటీ కాంటాక్ట్ పేరుతో ఆదివారం ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిదిలోని ఉప్పుగూడ, ఫలకనుమ రైల్వే స్టేషన్, ఆర్.ఎన్ కాలనీ, నాగులబండ తదితర ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ముగ్గురిపై పాత […]
దిశ, చార్మినార్: గంజాయి రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని డీసీపీ గజారావు భూపాల్ అన్నారు. ప్రజలందరూ సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని సూచించారు. పోలీసులు కార్డన్ సెర్చ్ కి కమ్యూనిటీ కాంటాక్ట్ పేరుతో ఆదివారం ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిదిలోని ఉప్పుగూడ, ఫలకనుమ రైల్వే స్టేషన్, ఆర్.ఎన్ కాలనీ, నాగులబండ తదితర ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాలలో 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ముగ్గురిపై పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. సరైన నెంబర్ ప్లేట్ లేని, పెండింగ్ చల్లాన్ ఉన్న 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫలకనుమ ఏసీపీ మహమ్మద్ మాజీద్,ఇన్ స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని తదితరులు పాల్గొన్నారు.