జ్యోతిలక్ష్మికి ఐదేళ్లు..

జ్యోతిలక్ష్మి.. చార్మి కౌర్ ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. చార్మి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలై ఐదేళ్లయిన సందర్భంగా.. ఈ చిత్ర అనుభవాలను అభిమానులతో పంచుకుంది చార్మి. ‘జ్యోతిలక్ష్మిని మించిన గొప్ప చిత్రం నా లైఫ్‌లో చేయలేను. ఈ సినిమా తనకు నటిగా చివరిది కాగా.. నిర్మాతగా తొలి సినిమా’ అని వెల్లడించింది. ఆ సమయంలో తనకు సపోర్ట్‌గా […]

Update: 2020-06-12 05:48 GMT

జ్యోతిలక్ష్మి.. చార్మి కౌర్ ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. చార్మి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలై ఐదేళ్లయిన సందర్భంగా.. ఈ చిత్ర అనుభవాలను అభిమానులతో పంచుకుంది చార్మి. ‘జ్యోతిలక్ష్మిని మించిన గొప్ప చిత్రం నా లైఫ్‌లో చేయలేను. ఈ సినిమా తనకు నటిగా చివరిది కాగా.. నిర్మాతగా తొలి సినిమా’ అని వెల్లడించింది. ఆ సమయంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన నిర్మాత సి. కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చార్మి.. ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను పూరీకి థ్యాంక్స్ చెప్పింది. ‘పూరి కనెక్ట్స్ ద్వారా న్యూ లైఫ్ స్టార్ట్ చేసేందుకూ ఇక్కడే పునాది పడింది, గొప్ప లక్ష్యాలతో ముందుకు సాగుతున్న పూరి కనెక్ట్స్స్ మరిన్ని అమేజింగ్ బ్లాక్ బస్టర్స్ సాధించాలి’ అని కోరుకుంది చార్మి.

https://www.instagram.com/p/CBU0jSRlTjL/?igshid=1a1glj0m840pv

ఈ సందర్భంగా జ్యోతిలక్ష్మిలో కీలక పాత్రలో కనిపించిన సత్యదేవ్‌ను చార్మి ప్రశంసించింది. ‘ఒక గొప్ప నటుడు ఆడిషన్ చేసిన రోజే పుడతాడు.. ఈ సినిమా విజయంపై ప్రభావం చూపిన సత్యదేవ్ అలాగే పుట్టాడని’ తెలిపింది. అతడు లైఫ్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Tags:    

Similar News