2022లో ‘హైబ్రిడ్ వర్క్ ప్లేసెస్’.. ఉత్తమ ఫలితాల సాధనకు ఛాన్స్
దిశ, ఫీచర్స్ : రెండేళ్ల నుంచి ‘కొవిడ్-19’ ఆందోళన ‘వర్క్‌లైఫ్’లో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఐటీ సహా అనేక ఎమ్‌ఎన్‌సీ సంస్థలు ఇప్పటికీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఫెసిలిటీ కొనసాగిస్తున్నాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో మునుపటిలా ఆఫీసులు కళకళలాడుతాయని భావిస్తున్న తరుణంలో.. తానింకా బతికే ఉన్నానంటూ ‘ఓమిక్రాన్’ రూపంలో మళ్లీ వచ్చేసింది వైరస్. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. మహమ్మారి మన జీవితంలో ఒక భాగంగానే కొనసాగుతోంది. దీంతో వర్క్ స్టేషన్స్, ఆఫీసులు ఎలా […]
దిశ, ఫీచర్స్ : రెండేళ్ల నుంచి ‘కొవిడ్-19’ ఆందోళన ‘వర్క్‌లైఫ్’లో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఐటీ సహా అనేక ఎమ్‌ఎన్‌సీ సంస్థలు ఇప్పటికీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఫెసిలిటీ కొనసాగిస్తున్నాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో మునుపటిలా ఆఫీసులు కళకళలాడుతాయని భావిస్తున్న తరుణంలో.. తానింకా బతికే ఉన్నానంటూ ‘ఓమిక్రాన్’ రూపంలో మళ్లీ వచ్చేసింది వైరస్. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. మహమ్మారి మన జీవితంలో ఒక భాగంగానే కొనసాగుతోంది. దీంతో వర్క్ స్టేషన్స్, ఆఫీసులు ఎలా పని చేస్తాయనే అంశంపై మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే లార్జ్ ఆఫీస్ స్పేసెస్ నుంచి కొత్తగా శాటిలైట్, డీసెంట్రలైజ్డ్ లేదా ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేసెస్ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇలాంటి ‘హైబ్రిడ్ వర్క్‌ప్లేస్’కు మారడం సంచలనం కాదు. సాంకేతికత కూడా అనువైన పని ప్రదేశాల కోసం కొత్త మార్గాలను అందిస్తుండటంతో కార్యాలయాలతో ఉద్యోగులకున్న సంబంధం నెమ్మదిగా పునర్నిర్వచించబడుతోంది. ఈ నేపథ్యంలో 2022 వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది?
గత రెండేళ్లలో ‘వర్క్ లైఫ్’లో చాలా మార్పులొచ్చాయి. కొంతమందికి ఇంటి వద్ద పనిచేసే వెసులుబాటు లేకపోవచ్చు. ఇంకొందరికి ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవచ్చు. కానీ పాండమిక్ టైమ్ నుంచి ఉద్యోగులంతా విపత్కర పరిస్థితుల్లోనూ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చేందుకు అవస్థలు పడ్డారు. అయితే కరోనా పరిస్థితుల నుంచి మెల్లగా బయటకు రావడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో ప్రస్తుతం ఎప్పుడు, ఎక్కడ పనిచేయాలో ఎంపిక చేసుకునే విషయంలో కొంత సౌలభ్యం ఉంది. ఇది ప్రతి ఒక్కరికి పని ఒత్తిళ్లను, ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
హైబ్రిడ్ వర్క్ ప్లేస్ :
హెడ్‌క్వార్టర్‌గా పనిచేసే ఆఫీస్ లొకేషన్‌లో మార్పు లేకపోవచ్చు కానీ వర్క్‌ప్లేసెస్ మాత్రం మారిపోతున్నాయి. ఉద్యోగులు తమ ఇంటికి దగ్గరగా ఉన్న ప్రదేశాల నుంచి పని చేసేందుకు సంస్థలు అనుమతించడంతో ఈ ‘వర్క్ నియర్ హోమ్’ ట్రెండ్ మొదలైంది. దీంతో మెట్రో, నాన్-మెట్రో సిటీల్లోని సబ్-అర్బన్ ప్లేసెస్‌లో ఆయా కంపెనీలు మల్టిపుల్ శాటిలైట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. కొవిడ్ నేపథ్యంలో శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు కూడా సాధ్యపడటంతో పాటు ఆర్థికంగానూ కంపెనీలకు కలిసి రావడంతో హైబ్రిడ్ వర్క్ ప్లేసెస్‌ను కొనసాగించేందుకు కంపెనీలు ఇష్టపడుతున్నాయి.
ఇలా సేవ్ అయిన డబ్బుల్ని రీసెర్చ్, డెవలప్‌మెంట్ కోసమే కాక ఉద్యోగి అవసరాలు తీర్చేందుకు లేదా శాలరీ హైక్‌కు ఉపయోగిస్తుండటంతో టైర్ 2 నగరాలకు రివర్స్ మైగ్రేషన్ కొనసాగుతోంది. అహ్మదాబాద్, కోయంబత్తూర్, ఇండోర్, జైపూర్, కొచ్చి, లక్నో వంటి ప్రధాన నాన్-మెట్రో సిటీల్లో హైబ్రిడ్ స్టేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2023 నాటికి మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో ‘ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్’ 60 మిలియన్ చదరపు అడుగులను దాటుతుందని కొలియర్స్ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది.
ఎంప్లాయ్ – డ్రివెన్ వర్క్‌ప్లేస్ :
సాధారణంగా కంపెనీలు.. క్యూబికల్ ఆకృతిలో వర్గీకరించిన స్పేస్‌లో తమ ఉద్యోగులకు వర్క్ కేటాయిస్తాయి. ఇవి ఫ్లెక్సిబుల్‌గా ఉండకపోగా, ఆ వాతావరణంలో 8-9 గంటలు పనిచేయడమంటేనే సవాల్. ఈ ట్రెడిషనల్ మెథడ్‌కు ‘కరోనా’ బ్రేకులు వేసింది. ఉద్యోగుల బర్న్‌అవుట్‌ను నివారించేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు పాజిటివ్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కొనసాగించడం చాలా ముఖ్యమని అటు కంపెనీలతో పాటు ఇటు ఎంప్లాయీస్ గుర్తించారు. ఈ క్రమంలో రోస్టర్డ్ షిఫ్టింగ్ అవర్స్ స్థానంలో ఫ్లెక్సీ వర్క్ అవర్స్ కేటాయిస్తూ, పనికోసం డైనమిక్ స్థలాలను అందిస్తున్నాయి.
ఈ తరహా ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేసెస్‌లో ఫిక్స్‌డ్ డెస్క్‌లు, కంఫర్టబుల్ కాన్ఫరెన్స్ రూమ్స్, స్లీక్ ప్రైవేట్ ఆఫీసులు, ఇంటర్నల్ డే బెడ్స్, ఆర్ట్-మిక్స్ లాంజెస్, కేఫ్స్, ప్యాంట్రీ, వెల్‌నెస్ రూమ్స్ తమ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. పైగా ఇంటికి సమీపం నుంచే పని చేయడం ద్వారా ఉద్యోగులు కమ్యూనిటీ కోసం ఖర్చు చేసే సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా వర్క్, పర్సనల్ లైఫ్‌ను చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు.
సోషల్ వర్క్ ప్లేస్ :
కొత్త విషయాలు, ఆలోచనలను పరస్పరం ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ముఖ్యం. న్యూ ఎంప్లాయీస్ లేదా కొత్త తరానికి ఇది మరింత అవసరం. కమ్యూనిటీ బిల్డింగ్ ఇనీషియేటివ్స్ ద్వారా ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌లు వివిధ పరిశ్రమలకు చెందిన నిపుణులతో వ్యక్తిగతంగా లేదా వర్చువల్ కార్యక్రమాల ద్వారా కనెక్ట్ చేసేందుకు అవకాశాలను ప్రోత్సహిస్తాయి. వీక్లీ ఈవెంట్స్, వర్క్‌షాప్.. ఉద్యోగుల మధ్య మరింత బాండింగ్‌కు తోడ్పడతాయి. ఈ చర్యలు ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తోడ్పడతాయి.
డీసెంట్రలైజేషన్‌కు మహమ్మారి సమయంలో ప్రాముఖ్యత సంతరించింది. మార్పుకు అనుగుణంగా తమ వ్యాపార కేంద్రాలను డివైడ్ చేయడం సంస్థలకు కలిసివస్తుండగా.. యాజమాన్యాలు సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నందున ఉద్యోగులు కూడా సంతోషంగా పనిచేస్తున్నారు.