‘రూ. 770 కోట్లు ఎగ్గొట్టిన మంత్రి గంగుల.. త్వరలో జైలుకు’
దిశ, తాండూరు: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్పై బీజేపీ నేత ఏ.చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి జీపీఆర్ గార్డెన్లో బీజేపీ మండల అధ్యక్షుడు సందీప్ కుమార్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.770 కోట్లు ఎగ్గొట్టారని.. […]
దిశ, తాండూరు: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్పై బీజేపీ నేత ఏ.చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి జీపీఆర్ గార్డెన్లో బీజేపీ మండల అధ్యక్షుడు సందీప్ కుమార్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.770 కోట్లు ఎగ్గొట్టారని.. త్వరలో జైల్లో ఊచకోతలు లెక్క పెట్టాల్సిందేనని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ టక్కుటమార విద్యలను ఈనాడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. నా రాజకీయ చరిత్రలో సీఎం కేసీఆర్ లాంటి ఝూటా సీఎంను ఎక్కడ చూడలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నర్సింహులు, జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి హరి కృష్ణ యాదవ్, జిల్లా మోర్చా ఉపాధ్యక్షులు ఆనంద్ నాయక్, మండల ఇన్చార్జీ భద్రేశ్వర్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శివప్రసాద్, రాంజీ రాథోడ్, రమ్య నాయక్ తదితరులు ఉన్నారు.