ఊరుకునేది లేదు…ఇక నేనే ఫీల్డ్ మీదకు వస్తా: చంద్రబాబు
దిశ,వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంఘాన్ని నియంత్రిం చడానికి సీఎం ఎవరని ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో,వార్డుల్లో శాంతిభద్రతలను కాపాడాలని పేర్కొన్నారు. దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు. అవసరమైతే తానే ఫీల్డ్‌కు వస్తానని తెలిపారు. ఆన్ లైన్‌లో కూడా నామినేషన్లు స్వీక రించాలని కోరారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో పంచాయతీ ఎన్నికలు జరపాలన్నారు. […]
దిశ,వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంఘాన్ని నియంత్రిం చడానికి సీఎం ఎవరని ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో,వార్డుల్లో శాంతిభద్రతలను కాపాడాలని పేర్కొన్నారు. దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు. అవసరమైతే తానే ఫీల్డ్‌కు వస్తానని తెలిపారు. ఆన్ లైన్‌లో కూడా నామినేషన్లు స్వీక రించాలని కోరారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో పంచాయతీ ఎన్నికలు జరపాలన్నారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని చెప్పారు.