ఏపీలో రాజా రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది: చంద్రబాబు
దిశ ఏపీ బ్యూరో: దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుచేస్తోంటే, ఏపీలో మాత్రం వైఎస్ జగన్ తన సొంత ‘రాజా రెడ్డి రాజ్యాంగం’ అమలుచేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తూ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ దుర్మార్గాల వల్ల రాష్ట్రానికి జరిగిన కీడు, ప్రజలకు కలిగిన చేటు […]
దిశ ఏపీ బ్యూరో: దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుచేస్తోంటే, ఏపీలో మాత్రం వైఎస్ జగన్ తన సొంత ‘రాజా రెడ్డి రాజ్యాంగం’ అమలుచేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తూ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ దుర్మార్గాల వల్ల రాష్ట్రానికి జరిగిన కీడు, ప్రజలకు కలిగిన చేటు గురించి మీ దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. వైఎస్సార్సీపీ పాలకుల నైజాన్ని ప్రజలే చక్కదిద్దాలని ఈ లేఖలో కోరారు. న్యాయాన్ని, చట్టాన్నీ కాపాడటంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. ప్రజల ప్రాథమికహక్కుల పరిరక్షణకోసం గత ఏడాదిగా తెలుగుదేశం చేస్తోన్న రాజీలేని పోరాటంలో రాజకీయాలకు అతీతంగా కలిసివచ్చిన వారందరినీ అభినందిస్తున్నానన్నారు. ఇకపై కూడా రాష్ట్ర ప్రయోజనాలను, భావితరాల భవిష్యత్తును కాపాడే కృషిలో మీరంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు.