కర్నూలు జంటహత్యలపై డీజీపీకి చంద్రబాబు లేఖ
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలోని జంటహత్య కేసులో నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడేవారికి సమాజంలో జీవించే హక్కులేదని చంద్రబాబు లేఖలో తెలిపారు. జిల్లాలో జూన్ 17న గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో వడ్డు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దారుణంగా హత్య చేశారన్నారు. […]
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలోని జంటహత్య కేసులో నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడేవారికి సమాజంలో జీవించే హక్కులేదని చంద్రబాబు లేఖలో తెలిపారు. జిల్లాలో జూన్ 17న గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో వడ్డు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దారుణంగా హత్య చేశారన్నారు.
వారి సోదరుడు మోహన్‌రెడ్డికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా వైసీపీ దుండగులు దారికాచి హత్య చేశారని లేఖలో తెలియజేశారు. ఈ జంట హత్యల కేసులో నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. సాక్షుల్ని బెదిరిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. నేరస్తులను వెంటనే అదుపులోకి తీసుకుని సాక్షులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.