కరోనాను జయిస్తాడనుకున్నా.. ఎస్వీ ప్రసాద్ మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిబ‌ద్ధత క‌లిగిన ఉన్నతాధికారిగా గుర్తింపు పొందిన ఆయన మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా.. ఎస్వీ ప్రసాద్ మృతిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో అందరినీ ముందుండి నడిపే అధికారిగా చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన సేవలను గుర్తుచేస్తున్నారు. ఎస్వీ ప్రసాద్ అకాల మరణం ఏపీకి […]

Update: 2021-05-31 22:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిబ‌ద్ధత క‌లిగిన ఉన్నతాధికారిగా గుర్తింపు పొందిన ఆయన మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా.. ఎస్వీ ప్రసాద్ మృతిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో అందరినీ ముందుండి నడిపే అధికారిగా చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన సేవలను గుర్తుచేస్తున్నారు. ఎస్వీ ప్రసాద్ అకాల మరణం ఏపీకి తీరనిలోటన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నామన్నారు. ఎస్వీ ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags:    

Similar News