అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2022 నాటికి అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మించాలని భావించామని, తొలిదశలో 62ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పనులన్నీ పూర్తిచేస్తే అమరావతి రూపరేఖలు మారిపోయేవని అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి అన్ని విధాలా అనుకూలమని, నాడు జగన్‌ కూడా అసెంబ్లీలో మద్దతు పలికారని తెలిపారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా సహకారం అందించిందని, ఎలాంటి అభ్యంతరాలు […]

Update: 2020-08-14 07:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2022 నాటికి అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మించాలని భావించామని, తొలిదశలో 62ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పనులన్నీ పూర్తిచేస్తే అమరావతి రూపరేఖలు మారిపోయేవని అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి అన్ని విధాలా అనుకూలమని, నాడు జగన్‌ కూడా అసెంబ్లీలో మద్దతు పలికారని తెలిపారు.

అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా సహకారం అందించిందని, ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని, ఇది ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రాజధాని రైతులకు ప్లాట్లు అందజేశామని, రైతులకు పదేళ్ల పాటు ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు.

Tags:    

Similar News