సీతక్కను పరామర్శించిన బాబు.. భావోద్వేగంతో ట్వీట్ చేసిన ఎమ్మెల్యే

దిశ,ములుగు: ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గతకొన్ని రోజుల క్రితం సీతక్క తల్లి సమ్మక్క కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆమెను హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సోమవారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏఐజి హాస్పిటల్ ని సందర్శించి సీతక్కను పరామర్శించారు. సీతక్క తల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులనడిగి తెలుసుకున్నారు. సీతక్క కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం […]

Update: 2021-06-07 04:21 GMT

దిశ,ములుగు: ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గతకొన్ని రోజుల క్రితం సీతక్క తల్లి సమ్మక్క కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆమెను హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సోమవారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏఐజి హాస్పిటల్ ని సందర్శించి సీతక్కను పరామర్శించారు. సీతక్క తల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులనడిగి తెలుసుకున్నారు. సీతక్క కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఇక ఈ విషయాన్నీ సీతక్క తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. “నా తల్లి వెంటిలేటర్ మీద నుండి లేవగానే మొదటి వార్త ఇదే చెప్తాను. నీ యోగక్షేమాలు తెలుసుకొని చంద్రబాబు అన్న నాకు దైర్యం చెప్పారని.. థాంక్యూ చంద్రబాబు అన్న” అంటూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News