జగన్‌కు 48గంటల సమయం ఇస్తున్నాం: చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానుల విషయంపై ఆలోచించుకోవాలని దీనిపై 48గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజల వద్దకు వెళ్దామని.. రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధమని, మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రజల భవిష్యత్ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. మీకు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని అన్నారు. మీరు గెలిస్తే […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానుల విషయంపై ఆలోచించుకోవాలని దీనిపై 48గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజల వద్దకు వెళ్దామని.. రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధమని, మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రజల భవిష్యత్ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. మీకు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని అన్నారు. మీరు గెలిస్తే రాజధానుల అంశంపై టీడీపీ ఒక్క మాటకూడా మాట్లాడదని స్పష్టం చేశారు.
5కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
ఐదుకోట్ల ప్రజలకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రాజధాని అమరావతిని మార్చుతామని ఒక్కమాట కూడా చెప్పలేదని, ఇప్పుడు మూడు రాజధానులను ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్.. అమరావతి రాజధానికి ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు రాజధాని విషయంలో సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నమ్మక ద్రోహమని, ఐదుకోట్ల ఆంధ్రులను మోసం చేసినట్లే అవుతుందన్నారు.
రాజీనామాలు చేయడం ఒక్క నిమిషం పని
తమకు రాజీనామాలు చేయడం ఒక్క నిమిషం పని అని, అసెంబ్లీ రద్దుపై 48గంటల్లో జగన్ సర్కార్ క్లారిటీ ఇవ్వాలన్నారు. మా సవాల్‌ను స్వీకరిస్తారా ? ప్రజలను మోసం చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. రాజధానుల విషయంలో సౌతాఫ్రికా మీకు ఆదర్శమా ? అంటూ ఫైరయ్యారు.