ఫేక్ వార్త వైరల్ పట్ల బాబు ఆగ్రహం

దిశ, ఏపీ బ్యూరో: రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ తార స్థాయికి చేరుతోంది. లేనివి ఉన్నట్టు, జరగనివి జరిగినట్టు వార్తలు క్రియేట్ చేయడంలో ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారని, చైనా-భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు బాబు సలహా ఇచ్చారని చెబుతూ మార్ఫింగ్ ఫొటోతో ఒక ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై బాబు ఆగ్రహం […]

Update: 2020-06-19 03:43 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ తార స్థాయికి చేరుతోంది. లేనివి ఉన్నట్టు, జరగనివి జరిగినట్టు వార్తలు క్రియేట్ చేయడంలో ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారని, చైనా-భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు బాబు సలహా ఇచ్చారని చెబుతూ మార్ఫింగ్ ఫొటోతో ఒక ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌తో పాటు ఆయన చుట్టూ ఉండే నేరస్థులే ఇటువంటి మార్ఫింగ్‌ ఫొటోలు సృష్టిస్తూ ఇతరుల ప్రతిష్టను దిగజార్చడం, అవమానించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఫేక్ పోస్టులు చిరాకు తెప్పిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

Tags:    

Similar News