చెట్లను కాపాడేందుకు అంబులెన్స్ సర్వీస్
దిశ, వెబ్‌డెస్క్ : ఓ మనిషి ప్రాణాపాయంలో ఉంటే లేదా అత్యవసరమైన చికిత్స అవసరమైతే వెంటనే అంబులెన్స్(108) కోసం ఫోన్ చేస్తాం. నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ సదరు వ్యక్తి దగ్గరకు చేరుకుంటుంది. అందులోని మెడికల్ స్టాఫ్ వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందిస్తూ.. హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఇలానే ఓ చెట్టు కూడా ప్రమాదంలో ఉందని లేదా ఓ చెట్టుకు అర్జెంటుగా చికిత్స చేయాలని, అదీకాదంటే తరతరాల చెట్టు కాలగర్భంలో కలిసిపోతోందని అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే..? వింతగా ఉంది కదూ! […]
దిశ, వెబ్‌డెస్క్ : ఓ మనిషి ప్రాణాపాయంలో ఉంటే లేదా అత్యవసరమైన చికిత్స అవసరమైతే వెంటనే అంబులెన్స్(108) కోసం ఫోన్ చేస్తాం. నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ సదరు వ్యక్తి దగ్గరకు చేరుకుంటుంది. అందులోని మెడికల్ స్టాఫ్ వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందిస్తూ.. హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఇలానే ఓ చెట్టు కూడా ప్రమాదంలో ఉందని లేదా ఓ చెట్టుకు అర్జెంటుగా చికిత్స చేయాలని, అదీకాదంటే తరతరాల చెట్టు కాలగర్భంలో కలిసిపోతోందని అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే..? వింతగా ఉంది కదూ! కానీ ఇది అక్షరాల నిజం. మనుషులవే కాదు.. మొక్కలవి కూడా ప్రాణాలే. మనకే కాదు.. వాటికి కూడా వ్యాధులొస్తాయి. మరి మనకు ప్రాణ వాయువునందించే మొక్కలు ప్రమాదంలో ఉంటే.. వాటి ప్రాణం నిలబెట్టకపోతే ఎలా? అందుకే చండీగడ్ అధికారులు జబ్బుపడ్డ మొక్కల కోసం త్వరలోనే అంబులెన్స్ సేవలను ప్రారంభించబోతున్నారు.
ఏమీ ఆశించకుండా మానవాళికి మేలుచేసేవి చెట్లు. కొన్నేండ్లుగా ఏపుగా పెరిగిన ఓ మహా వృక్షానికి.. ఏదైనా చీడపడితే కొద్ది రోజుల్లోనే నేలమట్టం అవుతుంది. అటువంటి మహావృక్షాలను బతికించుకుంటే.. మన రాబోయే తరాలకు కూడా దాని ఫలాలు దక్కుతాయి. అందుకోసమే జబ్బుపడ్డ వృక్షాలకు సరైన చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికారులు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. ‘‘క్రిమి కీటకాలతో, చీడ పురుగులతో జబ్బుపడ్డ వృక్షాల కోసం ఈ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాం. అలాంటి చెట్లను ప్రజలు గమనించినట్లయితే వాటి చికిత్స కోసం ఓ ప్రత్యేకమైన ఫోన్ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. వాటి చికిత్స నిమిత్తం వెంటనే ఓ బృందాన్ని కూడా పంపుతాం. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకొస్తాయి’’ అని ఎన్విరాన్‌మెంటల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ దేవేంద్ర దలై ప్రకటించారు.
తమిళనాడులో గజ, వర్ద తుఫానులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొన్ని వందల చెట్లతో పాటు మహా మహా వృక్షాలు నేలమట్టమయ్యాయి. అయితే.. ఆ తర్వాత చెన్నైలో అబ్దుల్ ఘని ఆధ్వర్యంలో ‘ట్రీ అంబులెన్స్’ మొదలైంది. వృక్షాలకు ఫస్ట్ ఎయిడ్ అందిచడంతో పాటు ఒక చోటు నుంచి మరో చోటుకు వృక్షాలను తీసుకెళ్లడం, సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్, ట్రీ ప్లాంటేషన్, ట్రీ సర్వీస్ చేయడం వంటివి ‘ట్రీ అంబులెన్స్’ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.