డిజిటల్ మీడియాకు ‘చాణక్య’ అవార్డు
పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌సీఐ) ప్రకటించిన ‘చాణక్య’ పురస్కారాన్ని శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై, సైనిక విభాగాధికారి కర్నల్ సత్యప్రకాశ్ యాదవ్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నాగమోహన్‌దాస్ అందించారు. ఈ అవార్డు అందుకున్నవారిలో తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ విభాగం డైరెక్టర్ కొణతం దిలీప్, ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ఈనాడు’ ఏపీ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు ఉన్నారు. కార్యక్రమంలో మాధ్యమ, సామాజిక, పరిపాలనా రంగాల్లో సేవలందించిన 34 […]
పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌సీఐ) ప్రకటించిన ‘చాణక్య’ పురస్కారాన్ని శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై, సైనిక విభాగాధికారి కర్నల్ సత్యప్రకాశ్ యాదవ్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నాగమోహన్‌దాస్ అందించారు. ఈ అవార్డు అందుకున్నవారిలో తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ విభాగం డైరెక్టర్ కొణతం దిలీప్, ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ఈనాడు’ ఏపీ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు ఉన్నారు. కార్యక్రమంలో మాధ్యమ, సామాజిక, పరిపాలనా రంగాల్లో సేవలందించిన 34 మందికి పురస్కారాలు ప్రదానం చేశారు. పురస్కార గ్రహీత దిలీప్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో అభినందించారు.
Tags: prci, chanakya award, eenadu, bangalore