22న చలో రాజ్ భవన్ : దామోదర రాజనర్సింహ

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 22న చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఆలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఇజ్రాయెల్ […]

Update: 2021-07-20 10:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 22న చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఆలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఎన్ఎస్ఓ సాఫ్ట్‌వేర్‌ ద్వారా అందరి డేటాలు చోరీ చేస్తున్నారని ఆరోపించారు. సామాన్యుల వ్యక్తుల డేటాను కూడా చోరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల నుంచి సామాన్యుల దాకా భద్రత లేకుండా పోయిందన్నారు. అందరికి భద్రత కల్పించేందుకు అనువుగా ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చలో రాజ్ భవన్ నిర్వహించి గవర్నర్ కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Tags:    

Similar News