కోచ్ ఫాక్టరీ, రైల్వే డివిజన్ సాధనకై చలో హైదరాబాద్
దిశ ప్రతినిధి, వరంగల్: మూడు దశాబ్దాల కలగా మిగిలిన కోచ్ ఫ్యాక్టరీ సాధనతో పాటు ఖాజిపేటను రైల్వే డివిజన్ చేయాలనే డిమాండ్ మరింత ఉదృతంగా మారింది. ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్దజరుగుతున్న చలో హైదరాబాద్ ధర్నాకు వరంగల్ జిల్లా నుండి ప్రజా సంఘాల నాయకులు తరలి వెళ్లారు. గత 30 ఏండ్లుగా ఖాజిపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరిఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని ఎన్నో పోరాటాలు […]
దిశ ప్రతినిధి, వరంగల్: మూడు దశాబ్దాల కలగా మిగిలిన కోచ్ ఫ్యాక్టరీ సాధనతో పాటు ఖాజిపేటను రైల్వే డివిజన్ చేయాలనే డిమాండ్ మరింత ఉదృతంగా మారింది. ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్దజరుగుతున్న చలో హైదరాబాద్ ధర్నాకు వరంగల్ జిల్లా నుండి ప్రజా సంఘాల నాయకులు తరలి వెళ్లారు.
గత 30 ఏండ్లుగా ఖాజిపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరిఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ నేటికి ఫలితం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా ప్రయోజనం లేదని, నీటి మూటలవుతున్నాయి తప్ప కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేదని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ఖాజిపేట రైల్వే జంక్షన్ ని రైల్వే డివిజన్ చేయడానికి అన్నిరకాల అర్హతలున్నాయని, ప్రభుత్వం దీనిపై చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం, రైల్వే డివిజన్ సాధనకై… ఉద్యమ సంఘాలతో కలిసిరావలని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం, రైల్వే డివిజన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
కాగా, ఈ చలో హైదరాబాద్ కార్యక్రమంలో వరంగల్ పౌర స్పందన వేదిక నల్లెల్ల రాజయ్య, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంటు కన్వీనర్ సాయిని నరేందర్, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు సోమ రామమూర్తి, తెలంగాణ సమరయోధుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు నలిగింటి చంద్రమౌళి, తెలంగాణ ఆర్ టి సి ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి గోధుమల కుమారస్వామి, జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్, తెలంగాణ ఇంటి పార్టీ జిల్లా నాయకులు దామెరకొండ కొమురయ్య, బి.సి స్టడీ ఫోరం నాయకులు సూరం నిరంజన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా నాయకులు సందెల సునిల్, గోనెల దేవేందర్ తదితరులు వెళ్లారు.