13న చలో అసెంబ్లీ యధాతథం
హైదరాబాద్: ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న నిర్వహించతలపెట్టిన “చలో అసెంబ్లీ” యధాతథంగా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక జేఏసీ ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం చట్టబద్దమేనని స్పష్టం చేసింది. ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారత భవన్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. […]
హైదరాబాద్: ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న నిర్వహించతలపెట్టిన “చలో అసెంబ్లీ” యధాతథంగా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక జేఏసీ ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం చట్టబద్దమేనని స్పష్టం చేసింది. ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారత భవన్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. చలో అసెంబ్లీకి అనుమతి లేదంటూ సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. జేఏసీ కోరిన విధంగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనకు అనుమతినివ్వాలని కోరారు. పెన్షనర్లు, ఉద్యోగులందరినీ హైదరాబాద్‌కు రాకుండా నిరోధించాలంటే సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చలో అసెంబ్లీ గోడపత్రికలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమములో పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య, రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్, టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు కె.జంగయ్య, టీపీటీఎఫ్ అధ్యక్షుడు కె. రమణ, డీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Tags: chalo assembly, march 13, protest, tsutf, pensioners jac chairman, tptf, dtf,