కేసీఆర్‌కు క్రేజీ షాక్ ఇచ్చిన శాలపల్లి ఓటర్లు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి రెండు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం దక్కించుకున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా షాక్ తగిలినట్లైంది. అంతేగాకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లి గ్రామంలో ప్రారంభించారు. శాలపల్లి గ్రామస్తులు సైతం కేసీఆర్‌ను ఊహించని దెబ్బకొట్టారు. […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి రెండు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం దక్కించుకున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా షాక్ తగిలినట్లైంది. అంతేగాకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లి గ్రామంలో ప్రారంభించారు. శాలపల్లి గ్రామస్తులు సైతం కేసీఆర్‌ను ఊహించని దెబ్బకొట్టారు. శాలపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.