బాధ్యతలు చేపట్టిన మూడు కార్పొరేషన్ల చైర్మన్లు

దిశ, తెలంగాణ బ్యూరో : మూడు కార్పొరేషన్లకు చైర్మన్లు ముగ్గురు సభ్యులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా క్రిశాంక్, టెక్నికల్ సర్వీస్ చైర్మన్‌గా (tsts) జగన్ మోహన్ రావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించాలని, పార్టీ కోసం పని […]

Update: 2021-12-29 01:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మూడు కార్పొరేషన్లకు చైర్మన్లు ముగ్గురు సభ్యులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా క్రిశాంక్, టెక్నికల్ సర్వీస్ చైర్మన్‌గా (tsts) జగన్ మోహన్ రావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించాలని, పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు తథ్యమన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News