జగన్ హామీ ఇచ్చారు.. అభివృద్ధి చేస్తాం!

దిశ, వెబ్‌డెస్క్ : దేవీ నవరాత్రుల సందర్భంగా సీఎం జగన్ ఇవాళ విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో దుర్గగుడి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్లు ఆలయ చైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. కేశ ఖండన శాల, ప్రసాదం పోటు, భోజనశాలతో పాటు సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. విరిగిపడ్డ కొండ చరియలు తొలగించడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సోమినాయుడు స్పష్టంచేశారు. ఆలయ ఈవో సురేష్‌బాబు […]

Update: 2020-10-21 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేవీ నవరాత్రుల సందర్భంగా సీఎం జగన్ ఇవాళ విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో దుర్గగుడి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్లు ఆలయ చైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. కేశ ఖండన శాల, ప్రసాదం పోటు, భోజనశాలతో పాటు సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. విరిగిపడ్డ కొండ చరియలు తొలగించడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సోమినాయుడు స్పష్టంచేశారు.

ఆలయ ఈవో సురేష్‌బాబు మాట్లాడుతూ ”కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోయినట్లు తమకు సమాచారం లేదని చెప్పారు. కొండచరియల కింద ఎవరూ లేరని అనుకుంటున్నట్లు వివరించారు.ఈ ఘటనలో ఎక్కడా అధికారుల నిర్లక్ష్యం లేదు” అని తెలిపారు.

Tags:    

Similar News