ఈటల స్పందించడం లేదు: చాడ

దిశ, న్యూస్‌బ్యూరో: పెయిడ్ క్వారంటైన్‌లలో కనీస వసతులు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి దగ్గర రూ.30వేలు వసూలు చేసి కనీసం సరైన తిండి కూడా పెట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ పార్క్‌హోటల్‎లోని పెయిడ్ క్వారంటైన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు, చేతి వృత్తిదారులు, చిరువ్యాపారుల […]

Update: 2020-05-22 08:37 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: పెయిడ్ క్వారంటైన్‌లలో కనీస వసతులు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి దగ్గర రూ.30వేలు వసూలు చేసి కనీసం సరైన తిండి కూడా పెట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ పార్క్‌హోటల్‎లోని పెయిడ్ క్వారంటైన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు, చేతి వృత్తిదారులు, చిరువ్యాపారుల బతుకులు బజారు పాలయ్యాయని విమర్శించారు. అమెరికా, గల్ఫ్, ఇతర దేశాల నుంచి స్వస్థలాలకు వస్తున్నవారి నుంచి డబ్బులు వసూలు చేసి క్వారంటైన్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు.

విదేశాల నుంచి వచ్చిన వారంతా ధనికులు కాదని తెలిపారు. పెద్ద పెద్ద హోట్లల్లో పెట్టి వేలకు వేలు డబ్బులు చెల్లిస్తునప్పటికీ కనీస వసతులు కల్పించే పరిస్థితి లేదన్నారు. ఇదేనా తెలంగాణ ప్రభుత్వ ఉద్దారకమని చాడ ప్రశ్నించారు. చెన్నైలో విదేశాల నుంచి వచ్చేవారిని వారం రోజుల్లో హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మాట్లాడిన స్పందించడం లేదన్నారు. క్వారంటైన్ సెంటర్‌లలో సరైన తిండి పెట్టాలని, వైద్యులతో పర్యవేక్షణ చేయించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News