జీఎస్టీ పరిహారం ఇచ్చిన కేంద్రం!

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ జీఎస్టీ పరిహారంగా రూ.19,950 కోట్లను కేంద్రం చెల్లించింది. 2020 జనవరి 31 నాటికి పన్ను సెస్ కింద రూ. 78,874 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారంగా మొత్తం రూ. 1,20,498 కోట్లను చెల్లించినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ సెస్ కింద రూ. 95,081 కోట్లు వసూళ్లు జరిగాయని, […]

Update: 2020-02-21 01:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ జీఎస్టీ పరిహారంగా రూ.19,950 కోట్లను కేంద్రం చెల్లించింది. 2020 జనవరి 31 నాటికి పన్ను సెస్ కింద రూ. 78,874 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారంగా మొత్తం రూ. 1,20,498 కోట్లను చెల్లించినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ సెస్ కింద రూ. 95,081 కోట్లు వసూళ్లు జరిగాయని, అందులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 69,275 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం జీఎస్టీ సెస్ రూ. 62,611 కోట్లు వసూలు కాగా అందులో రూ. 41,146 కోట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదలయ్యాయి. నవంబర్ నుండి జీఎస్టీ వసూళ్లు వృద్ధి సాధించాయని, గడిచిన మూడు నెలల్లో ప్రతినెలా రూ. లక్ష కోట్లకుపైగా జీఎస్టీ వసూళ్లు జరిగాయని ఇటీవల ఆర్థికమంత్రి అన్నారు. ఇది మెరుగుపడిన ఆదాయసేకరణను సూచిస్తుంది.

Tags:    

Similar News