పామాయిల్ సాగుకు కేంద్రం అనుమతి..
దిశ,హైదరాబాద్ బ్యూరో రాష్ట్రంలో పామ్ఆయిల్ సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. రాబోయే రెండేళ్లలో 42వేల250 ఎకరాల్లో తెలంగాణలో పామ్ ఆయిల్ సాగు చేసుకోవడానికి అనుమతులొచ్చాయని తెలిపారు. శనివారం ఈ విషయమై హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలోని 246 మండలాలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలమని కేంద్ర ప్రభుత్వం సర్వే బృందం తేల్చిందని వెల్లడించారు. ఏటా రూ.40వేల కోట్ల పామాయిల్‌ను మన దేశం దిగుమతి […]
దిశ,హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలో పామ్ఆయిల్ సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. రాబోయే రెండేళ్లలో 42వేల250 ఎకరాల్లో తెలంగాణలో పామ్ ఆయిల్ సాగు చేసుకోవడానికి అనుమతులొచ్చాయని తెలిపారు. శనివారం ఈ విషయమై హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలోని 246 మండలాలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలమని కేంద్ర ప్రభుత్వం సర్వే బృందం తేల్చిందని వెల్లడించారు. ఏటా రూ.40వేల కోట్ల పామాయిల్‌ను మన దేశం దిగుమతి చేసుకుంటోందని, విదేశీ మారకద్రవ్యం ఆదా చేసేందుకు ప్రభుత్వం ఆయిల్‌పామ్ పంట సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తోందన్నారు.2019-20లో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 2వేల500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో కందిరైతులెవరూ ఆందోళన చెందవద్దని, మద్దతు ధర ఇచ్చి రాష్ట్రంలో పండిన మొత్తం కందిని ప్రభుత్వమే కొంటుందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
Read also..