డ్రోన్లు వాడుకోవడానికి బీసీసీఐకి అనుమతి
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ లైవ్ కవరేజి కోసం డ్రోన్లను వాడటానికి బీసీసీఐకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి మంజూరు చేసింది. ఇండియాలో డ్రోన్లను నగరాల మధ్యలో ఆపరేట్ చేయడంపై పలు ఆంక్షలు ఉన్నాయి. దీంతో బీసీసీఐ, డ్రోన్ కెమేరాలను ఆపరేట్ చేసే క్విడిచ్ కంపెనీ కలసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో తాము డ్రోన్లు ఉపయోగించడానికి అనుమతులు ఇవ్వాలని కోరింది. దీంతో కొన్ని నిబంధనల […]
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ లైవ్ కవరేజి కోసం డ్రోన్లను వాడటానికి బీసీసీఐకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి మంజూరు చేసింది. ఇండియాలో డ్రోన్లను నగరాల మధ్యలో ఆపరేట్ చేయడంపై పలు ఆంక్షలు ఉన్నాయి. దీంతో బీసీసీఐ, డ్రోన్ కెమేరాలను ఆపరేట్ చేసే క్విడిచ్ కంపెనీ కలసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో తాము డ్రోన్లు ఉపయోగించడానికి అనుమతులు ఇవ్వాలని కోరింది. దీంతో కొన్ని నిబంధనల మేరకు బీసీసీఐకి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్, వరల్డ్ కప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లలో డ్రోన్లు ఉపయోగించి చిత్రీకరించే అవకాశం ఉన్నది.