కృష్ణా బేసిన్‌పై కేంద్రం సమీక్ష

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా నదిలోని జలాల లభ్యత, ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సోమవారం సమీక్ష నిర్వహించింది. కృష్ణా బేసిన్ పరిధిలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన జలాల అంశంపై చర్చించింది. ఢిల్లీ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ నీటి అభివృద్ధి ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అధికారులు పాల్గొన్నారు. నేషనల్ హైడ్రాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు ఈ సమావేశంలో కృష్ణా‌నదితో పాటు ఉప నదులు, నీటి లభ్యత గురించి, సమగ్రంగా నీటి […]

Update: 2020-06-08 10:03 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా నదిలోని జలాల లభ్యత, ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సోమవారం సమీక్ష నిర్వహించింది. కృష్ణా బేసిన్ పరిధిలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన జలాల అంశంపై చర్చించింది. ఢిల్లీ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ నీటి అభివృద్ధి ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అధికారులు పాల్గొన్నారు. నేషనల్ హైడ్రాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు ఈ సమావేశంలో కృష్ణా‌నదితో పాటు ఉప నదులు, నీటి లభ్యత గురించి, సమగ్రంగా నీటి వినియోగానికి సంబంధించిన అంశాలపైనా విశ్లేషణాత్మకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, వాడుకున్న వివరాలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కృష్ణా నది బేసిన్‌లో ఏయే రాష్ట్ర పరిధిలో ఎంత మేర నీటి లభ్యత ఉంది, ఉప నదుల్లో నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుంది, గడిచిన దశాబ్ద కాలంలో ఈ బేసిన్‌లో నీటి ప్రవాహం ఏయే రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఎన్ఐహెచ్ ప్రస్తావించింది.

Tags:    

Similar News