కేంద్రమంత్రి చప్పల్‌పై కామెంట్.. అదిరిపోయిన రిప్లై!

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒకరు. బీజేపీ సిద్ధాంతాలపై ఆమెకు పట్టు ఉండటమే కాకుండా, పార్టీ విధివిధానాలు, పాలసీలపై నెటిజన్లు అడిగే ప్రశ్నలకు నిర్మోహమాటంగా జవాబిస్తుంటారు. తాజాగా కేంద్రమంత్రి ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ, ‘పాండమిక్ మార్నింగ్’అని టాగ్ తగిలించారు. ఇందులో స్మృతి ఇరానీ గార్డెన్ ‌లో కూర్చుని తన లాప్‌ట్యాప్‌లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నారు. ఈ […]

Update: 2020-12-10 05:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒకరు. బీజేపీ సిద్ధాంతాలపై ఆమెకు పట్టు ఉండటమే కాకుండా, పార్టీ విధివిధానాలు, పాలసీలపై నెటిజన్లు అడిగే ప్రశ్నలకు నిర్మోహమాటంగా జవాబిస్తుంటారు.

తాజాగా కేంద్రమంత్రి ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ, ‘పాండమిక్ మార్నింగ్’అని టాగ్ తగిలించారు. ఇందులో స్మృతి ఇరానీ గార్డెన్ ‌లో కూర్చుని తన లాప్‌ట్యాప్‌లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వేసుకున్న ‘చప్పల్ ’పై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

దీనికి బదులిచ్చిన కేంద్రమంత్రి..‘అరే బాయ్ వో హవాయ్ చప్పల్.. రూ.200 వాలి. కానీ బ్రాండ్ అడుగొద్దు.. అవి లోకల్ బ్రాండ్’అని అదిరిపోయే రిప్లై ఇచ్చారు. స్మృతి ఇరానీ కౌంటర్‌పై పలువురు నెటిజన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

కాగా, కరోనా పాండమిక్‌లో భాగంగా కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని బాగా ప్రచారం చేస్తోంది.‘వో కల్ ఫర్ లోకల్’స్లోగన్‌తో భారతీయ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించాలని, మిగతా ఉత్పాదకాల వినియోగాన్ని వాయిదా వేసుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా టెక్స్టైల్ మంత్రిగా కొనసాగుతున్న స్మృతి ఇరానీ లోకల్ బ్రాండ్స్ చప్పల్ వినియోగిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

Tags:    

Similar News