అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు : కిషన్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోగులంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కానీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పీఎం కేర్ నిధి కింద గాంధీలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో జూనియర్ డాక్టర్లు […]

Update: 2021-05-18 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోగులంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కానీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

పీఎం కేర్ నిధి కింద గాంధీలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం సమంజసం కాదన్నారు. జూడాల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కేంద్రమంత్రి సూచించారు. బ్లాక్ ఫంగస్ మందులను రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ లోకి తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News