మావోయిస్టుల హెచ్చరిక.. ఆపరేషన్ ప్రహార్-3ను వెంటనే ఆపండి

దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సృష్టించిన బీభత్సం గురించి అందరికీ తెలిసిందే. ఎదురుకాల్పుల్లో 22 మందికి పైగా జవాన్లు అమరులవ్వగా, ఒక జవాన్ కనిపించకుండా పోయాడు. ఈ విషయంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా సోమవారం ఛత్తీస్‌గఢ్ పర్యటనకు వెళ్లారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌తో సహా కేంద్ర హోంమంత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. […]

Update: 2021-04-05 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సృష్టించిన బీభత్సం గురించి అందరికీ తెలిసిందే. ఎదురుకాల్పుల్లో 22 మందికి పైగా జవాన్లు అమరులవ్వగా, ఒక జవాన్ కనిపించకుండా పోయాడు. ఈ విషయంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా సోమవారం ఛత్తీస్‌గఢ్ పర్యటనకు వెళ్లారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌తో సహా కేంద్ర హోంమంత్రి వెళ్లారు.

ఈ క్రమంలోనే మావోయిస్టులు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. ఆపరేషన్ ప్రహార్-3ను తక్షణమే నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా, ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పుల తర్వాత కనిపించకుండా పోయిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని మావోయిస్టులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, మావోయిస్టుల ప్రతీకారానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ముందుగా హిడ్మాను టార్గెట్ చేస్తూ కొత్త ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News