కరోనా ఎఫెక్ట్: రూ. 2,570 కోట్లు విడుదల
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు 2,570 కోట్ల రూపాయలు విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం, మరోవైపు కరోనా భూతం భయపెడుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల నిధులు విడుదల చేయాలంటూ ఏపీ సహా ఆరు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలతో ముడివేసింది. కరోనా భూతం తరుముకొచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థల నిధులు విడుదల చేయకతప్పలేదు. కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పారిశుద్ధ్య […]
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు 2,570 కోట్ల రూపాయలు విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం, మరోవైపు కరోనా భూతం భయపెడుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల నిధులు విడుదల చేయాలంటూ ఏపీ సహా ఆరు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలతో ముడివేసింది. కరోనా భూతం తరుముకొచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థల నిధులు విడుదల చేయకతప్పలేదు.
కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పారిశుద్ధ్య పనుల కోసం కేంద్రం ముందుగానే నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లోని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు 2,570 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి 2018-19 ఏడాదికి గాను రెండో విడత నిధుల కింద 870.23 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అంతేకాదు, ఏపీకి 2019-20 ఏడాది మొదటి విడత నిధుల కింద మరో 431 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల నిధుల ఆందోళన తగ్గినట్టైంది.
Tags: local body funds, nirmala sitharaman, union government, ap, tamilnadu, odisha, meghalaya, arunachalpradesh, nagaland