కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతి

హైదరాబాద్: లక్ష మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. ముందుచూపుతో కేంద్రానికి లేఖ రాసి అనుమతి వచ్చేలా చేసిన సీఎం కేసీఆర్‌కు, తమ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో ఈ యేడు కందుల దిగుమతి భారీగా పెరిగిందని వెల్లడించారు. మరో 56వేల టన్నుల కొనుగోలుకు అనుమతివ్వాలని లేఖ […]

Update: 2020-03-03 20:11 GMT

హైదరాబాద్: లక్ష మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. ముందుచూపుతో కేంద్రానికి లేఖ రాసి అనుమతి వచ్చేలా చేసిన సీఎం కేసీఆర్‌కు, తమ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో ఈ యేడు కందుల దిగుమతి భారీగా పెరిగిందని వెల్లడించారు. మరో 56వేల టన్నుల కొనుగోలుకు అనుమతివ్వాలని లేఖ రాసినట్టు చెప్పారు.

Tags: central government, green signal, Lentils, kcr, TRS, agricultural minister, niranjan reddy, narendra singh tomar, farmers, Pigeon pea

Tags:    

Similar News