విపత్కర సమయంలో ఇలా ప్రవర్తిస్తారా: కేంద్రం ఆగ్రహం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యులు,మెడికల్ సిబ్బంది పట్ల వారి ఇంటి యాజమానులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. రోగులకు వైద్యం చేసే వ్యక్తులు తమ ఇళ్లళ్లో ఉండటానికి వీల్లేదని, ఖాళీ చేసి వెళ్లిపోయాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది ఒక్క ఢిల్లీలోనే కాకుండా వివిధ రాష్ట్ర్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్నిఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య బృందం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.దీనిపై స్పందించిన కేంద్రం ఇంటి యాజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాంటి వారికి […]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యులు,మెడికల్ సిబ్బంది పట్ల వారి ఇంటి యాజమానులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. రోగులకు వైద్యం చేసే వ్యక్తులు తమ ఇళ్లళ్లో ఉండటానికి వీల్లేదని, ఖాళీ చేసి వెళ్లిపోయాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది ఒక్క ఢిల్లీలోనే కాకుండా వివిధ రాష్ట్ర్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్నిఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య బృందం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.దీనిపై స్పందించిన కేంద్రం ఇంటి యాజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాంటి వారికి తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తుంటే వారిని ఇల్లు ఖాళీ చేయించడమేంటని మండిపడింది. మరల ఈలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపింది. వైద్యులు, మెడికల్ సిబ్బంది ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని హోంశాఖ అధికారులు వారికి భరోసానిచ్చారు.
tags : corona, medical staff, vacate from home, order by house owner, serious by central govt