ఆరోగ్య సేతు యాప్ సురక్షితం : కేంద్రం

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో పాటు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్యను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ‘ఆరోగ్యసేతు’యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్‌లోని బ్లూటూత్‌, లొకేషన్ ఆధారంగా కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తులను మనం కలిసిందీ లేనిదీ ట్రాక్ చేసి చెబుతుంది. అలాగే, వైరస్‌పై అవగాహన కల్పించడంతోపాటు సలహాలు, సూచనలు అందిస్తుంది. స్వయంగా ప్రధాని మోదీనే ఈ యాప్ ను వాడాలంటూ.. భారత ప్రజలకు తెలియజేయడంతో.. కోట్లాది […]

Update: 2020-05-06 06:10 GMT

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో పాటు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్యను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ‘ఆరోగ్యసేతు’యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్‌లోని బ్లూటూత్‌, లొకేషన్ ఆధారంగా కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తులను మనం కలిసిందీ లేనిదీ ట్రాక్ చేసి చెబుతుంది. అలాగే, వైరస్‌పై అవగాహన కల్పించడంతోపాటు సలహాలు, సూచనలు అందిస్తుంది. స్వయంగా ప్రధాని మోదీనే ఈ యాప్ ను వాడాలంటూ.. భారత ప్రజలకు తెలియజేయడంతో.. కోట్లాది మంది భారతీయులు ఈ యాప్ ను వాడుతున్నారు. అయితే ఆరోగ్య సేతు యాప్‌లో ఉన్న ప్రజల సమాచారం భద్రంగా లేదంటూ, 90 మిలియన్ల భారతీయ ప్రజల సమాచారం ప్రమాదంలో పడిందని, వారి వ్యక్తిగత వివరాలు హ్యాకింగ్‌ చేసే అవకాశం ఉందని ఫ్రెంచ్‌ హ్యాకర్‌ మంగళవారం ట్విట్టర్‌లో ప్రభుత్వానికి సవాల్‌ విసిరాడు. దీంతో ఆరోగ్య సేతు ఉపయోగించే నెటిజన్లు అయోమయానికి గురయ్యారు. దాంతో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ డేటా సెక్యూరిటీకి ఎలాంటి సమస్య లేదని, సమాచారం సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్య సేతు యాప్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, డేటా హ్యాక్ కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా ఆరోగ్య సేతు ట్విట్టర్‌లో విడుదల చేసిన ప్రకటనపై ఇలియట్ ఆల్డర్‌సన్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి హ్యాకర్ స్పందించారు. ‘యాప్‌లో ఎలాంటి లోపాలు లేవని మీరు చెప్పారు. మేము దానిని సమీక్షించి రేపు మళ్లీ వస్తాం’ అంటూ బదులిచ్చాడు.

Tags: arogya setu, app, twitter, hack, Central government, coronavirus

Tags:    

Similar News