11 రాష్ట్రాల్లో కరోనా కల్లోలం.. మరోసారి లాక్‌డౌన్ దిశగా కేంద్రం..?
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. గతేడాది కరోనా తీవ్రరూపం దాల్చడంతో నాడు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం 2020 మార్చి 23 తర్వాత దేశంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కరోనా నిబంధనలు పాటించని క్రమంలో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్ సహా మొత్తంగా 11 రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రాత్రివేళ కర్ఫ్యూ, […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. గతేడాది కరోనా తీవ్రరూపం దాల్చడంతో నాడు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం 2020 మార్చి 23 తర్వాత దేశంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కరోనా నిబంధనలు పాటించని క్రమంలో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్ సహా మొత్తంగా 11 రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రాత్రివేళ కర్ఫ్యూ, ఒంటిపూట లాక్‌డౌన్ కూడా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే కేంద్రం మరోసారి దేశంలో కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం శుక్రవారం దేశంలో కరోనా పరిస్థితిపై అత్యవసర సమీక్ష నిర్వహించింది. మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కేసుల తీవ్రతపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. అయితే, ఏప్రిల్ నెలలో పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని కేబినెట్ కార్యదర్శి కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.దీంతో తదుపరి కార్యచరణలో పాటు కొవిడ్ రూల్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, మహారాష్ట్రలో రోజుకు 35వేల నుంచి 40వేల కేసులు నమోదవుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ తప్పేలా లేదని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని పరిస్థితి మరింత దిగజారితే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.