రైతుల ఆందోళనపై వెనక్కి తగ్గిన కేంద్రం
దిశ,వెబ్‌డెస్క్: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిని నిలువరించేందుకు పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో మేకులు, పెద్ద ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు రహదారి మధ్యలో కాంక్రీట్ పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు. అయితే ఆ మేకుల ఏర్పాటుపై దేశ ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురైంది. రైతులపై యుద్ధం చేస్తున్నారా అని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రం రోడ్లపై ఏర్పాటు చేయించిన […]
దిశ,వెబ్‌డెస్క్: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిని నిలువరించేందుకు పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో మేకులు, పెద్ద ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు రహదారి మధ్యలో కాంక్రీట్ పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు. అయితే ఆ మేకుల ఏర్పాటుపై దేశ ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురైంది. రైతులపై యుద్ధం చేస్తున్నారా అని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రం రోడ్లపై ఏర్పాటు చేయించిన మేకుల్ని తక్షణమే తొలగించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.