రాష్ట్రాలకు రెమిడెసివిర్ సప్లై నిలిపేస్తున్నాం- కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్లకు చికిత్సలో వినియోగిస్తు్న్న యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌ను రాష్ట్రాలకు సప్లైను నిలిపేస్తు్న్నామని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో రెమిడెసివిర్ ఉత్పత్తి పది రెట్లు పెరిగిందని, డిమాండ్‌కు మించి సరఫరా ఉన్నదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలో ఏప్రిల్ 11న 33వేల వయల్స్ ఉత్పత్తి జరిగేవని, నేడు అవి 3.50లక్షలకు పెరిగిందని వివరించారు. నెల రోజుల్లోనే రెమిడెసివిర్ ఉత్పత్తి ప్లాంట్‌లను 20 నుంచి […]

Update: 2021-05-29 07:34 GMT

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్లకు చికిత్సలో వినియోగిస్తు్న్న యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌ను రాష్ట్రాలకు సప్లైను నిలిపేస్తు్న్నామని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో రెమిడెసివిర్ ఉత్పత్తి పది రెట్లు పెరిగిందని, డిమాండ్‌కు మించి సరఫరా ఉన్నదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలో ఏప్రిల్ 11న 33వేల వయల్స్ ఉత్పత్తి జరిగేవని, నేడు అవి 3.50లక్షలకు పెరిగిందని వివరించారు. నెల రోజుల్లోనే రెమిడెసివిర్ ఉత్పత్తి ప్లాంట్‌లను 20 నుంచి 60కి పెంచగలిగామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సమర్థంగా ఛేదించామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో డిమాండ్‌కు మించిన సప్లై ఉన్నదని, అందుకే రాష్ట్రాలకు సరఫరాలను నిలిపివేసే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ డ్రగ్ ధరలను సీడీఎస్‌సీవో నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరార్థం కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిల్వల కింద 50 లక్షల వయల్స్‌ను సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

Tags:    

Similar News