కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు భారీగా ఆ మాత్రలు

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు పెద్దఎత్తున హైడ్సాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ) మాత్రలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ మొదలైన తర్వాత ఇంత భారీగా హెచ్‌సీక్యూ మాత్రలు పంపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 4.24 కోట్ల మందులను పంపిణీ చేయనున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మలేరియా చికిత్సకు […]

Update: 2020-07-29 09:15 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు పెద్దఎత్తున హైడ్సాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ) మాత్రలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ మొదలైన తర్వాత ఇంత భారీగా హెచ్‌సీక్యూ మాత్రలు పంపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 4.24 కోట్ల మందులను పంపిణీ చేయనున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మలేరియా చికిత్సకు ఉపయోగించే ఈ మాత్రలను ఇతర వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుతం కొవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందించేందుకు కూడా హెచ్‌సీక్యూని వినియోగిస్తున్నారు. కొవిడ్-19 జాతీయ టాస్క్‌ఫోర్స్ సైతం కరోనా వైరస్‌ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే మందుగా దీన్ని సిఫారసు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పేషెంట్ల చికిత్సలోనూ, రోగనిరోధక శక్తిని పెంచేందుకు గానూ రాష్ట్రాలు వీటిని వినియోగించాల్సి ఉంటుందిని పేర్కొన్నారు.

Tags:    

Similar News