థియేటర్ల కెపాసిటీని పెంచిన కేంద్రం.. ఉత్తర్వులు జారీ

దిశ,వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి కట్టడి నేపథ్యంలో కేంద్రం గతంలో ఇచ్చిన మార్గదర్శకాలలో కొన్ని సవరణలు చేసింది. వాటిలో ప్రధానంగా సినిమా థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీని 100శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్రం జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల( sop -Standard Operating Procedures) ప్రకారం.. సినిమా థియేటర్లలో కరోనా వ్యాప్తిని అరికట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటెమెంట్ జోన్లలో సినిమా సంబంధిత […]

Update: 2021-01-31 00:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి కట్టడి నేపథ్యంలో కేంద్రం గతంలో ఇచ్చిన మార్గదర్శకాలలో కొన్ని సవరణలు చేసింది. వాటిలో ప్రధానంగా సినిమా థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీని 100శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కేంద్రం జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల( sop -Standard Operating Procedures) ప్రకారం.. సినిమా థియేటర్లలో కరోనా వ్యాప్తిని అరికట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటెమెంట్ జోన్లలో సినిమా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించకూడదు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చు. దేశంలోని అన్నీ సినిమా థియేటర్లలో ఎస్ఓపీ ప్రమాణాల్ని పాటిస్తూ 50శాతం ఉన్న సీట్ల సామర్ధ్యాన్ని 100శాతం సీట్లను కేటాయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News