రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక నిధి!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా నిలువనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరనికి కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం కోసం కేంద్రం రూ. 42,000 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ నుంచి కరోనా విపత్తుకు వ్యతిరేకంగా పోరాడటానికి ఈ బడ్జెట్‌ను రాష్ట్రాలకు అందుబాటులో ఉంటాయని కేంద్ర ప్రకటించింది. రాష్ట్ర విపత్తు నిధిలో కేంద్ర వాటా కింద రాష్ట్రాలు కనీసం రూ. 20,000 కోట్లు పొందుతాయని సమాచారం. జాతీయ విపత్తు నిధి అంటే రాష్ట్రాలకు కేంద్రం […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా నిలువనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరనికి కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం కోసం కేంద్రం రూ. 42,000 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ నుంచి కరోనా విపత్తుకు వ్యతిరేకంగా పోరాడటానికి ఈ బడ్జెట్‌ను రాష్ట్రాలకు అందుబాటులో ఉంటాయని కేంద్ర ప్రకటించింది.
రాష్ట్ర విపత్తు నిధిలో కేంద్ర వాటా కింద రాష్ట్రాలు కనీసం రూ. 20,000 కోట్లు పొందుతాయని సమాచారం. జాతీయ విపత్తు నిధి అంటే రాష్ట్రాలకు కేంద్రం అందించే ఎన్‌డీఆర్ఎఫ్ కింద కొత్త ఆర్థిక సంవత్సరానికి రూ. 22,000 కోట్లు కేటాయించింది. హోమ్‌మంత్రిత్వ శాఖ ఇప్పటికే కరోనా విపత్తు నిర్వహణ చట్టం కింద వర్గీకరణ మొదలుపెట్టింది. దీనికోసం కొన్ని పరిమితులకు లోబడి ఎస్‌డీఆర్ఎఫ్‌ను ఉపయోగించడానికి రాష్ట్రాలకు అర్హత ఉంటుంది. ఉదాహరణకు రాష్ట్రాల సహాయక చర్యల వ్యయం ఎస్‌డీఆర్ఎఫ్ 25 శాతం ఉంటుంది.
ఈ ఏడాది సవరించిన అంచనాలో ఎస్‌డీఆర్ఎఫ్ కేటాయింపును కేంద్రం రెట్టింపు చేసి రూ. 10,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్లకు మార్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులను కరోనా సంబంధిత సహాయక చర్యలకు వీలయినంత త్వరగా ఉపయోగించాలని రాష్ట్రాలకు కేంద్ర సూచిస్తోంది.
Tags: Centre to give, states Rs 42,000 crore, from FY21 budget, to fight with, coronavirus outbreak,