జమిలికి సై.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో జమిలి ఎన్నికలు జరగనున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2015-16లో ప్రధాని మోడీ హయాంలో తొలిసారి దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, దేశ మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆర్ధికంగా ఎంత అభివృద్ధి జరుగుతుందో చూడండి అంటూ జోరుగా ప్రచారం జరిగింది. నాటి ప్రచారం పై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నవీన్ చావ్లా స్పందించారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, అయినా దేశం మొత్తం […]

Update: 2020-12-11 00:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో జమిలి ఎన్నికలు జరగనున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2015-16లో ప్రధాని మోడీ హయాంలో తొలిసారి దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, దేశ మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆర్ధికంగా ఎంత అభివృద్ధి జరుగుతుందో చూడండి అంటూ జోరుగా ప్రచారం జరిగింది. నాటి ప్రచారం పై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నవీన్ చావ్లా స్పందించారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, అయినా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టమని అన్నారు.

తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) తీసుకున్న నిర్ణయంతో 2022లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు ప్రధాని మోడీతో పాటు కేంద్రంలో ఉన్న ముఖ్యనేతలు సైతం జమిలి ఎన్నికలు జరుగుతాయని, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు పూర్తిగా తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఊహగానాలకు ఊతమిచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్ కార్డుల తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటర్ ఐడికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేస్తున్నామని ప్రకటించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. నేషనల్ మీడియా కథనం ప్రకారం.. ప్రస్తుతం జారీ అవుతున్న ఓటర్ ఐడి కార్డులలో ఒక క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. డిజిటలైజ్‌లో మాత్రం రెండు క్యూఆర్ కోడ్‌లు ఉండనున్నాయి. అందులో ఒకటి మన వివరాలు , రెండో క్యూఆర్ కోడ్‌లో మన తల్లిదండ్రులను పేర్లను జతచేస్తారు. ఓటర్ ఐడీలో వ్యక్తిగత వివరాలతో పాటు కాంటాక్ట్ నెంబర్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ ఆధారంగా మనం ఓటర్ ఐడీని ఎక్కడ కావాలంటే అక్కడ.. ఆ క్షణంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.

కాగా, ఈ డిజిటలైజ్ పక్రియ 2021లో జరిగే అస్సాం, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు జాతీయ మీడియా ఓ కథనంలో పేర్కొంది.

Tags:    

Similar News