కలెక్టర్లతో కేంద్ర కేబినెట్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆయన రాష్ట్రంలోని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లాల్లో ఇప్పటికే గుర్తించిన కంటైన్ మెంట్ ప్రాంతాల్లో జనసంచారం పూర్తిగా నిషేధించాలన్నారు. అన్ని మతపరమైన కార్యక్రమాలపై నిషేధం ఉందని, కాబట్టి ఎవరూ ప్రార్థనల కోసం బయటకు రాకుండా చూడాలన్నారు. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్స్, […]

Update: 2020-04-15 06:21 GMT

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆయన రాష్ట్రంలోని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లాల్లో ఇప్పటికే గుర్తించిన కంటైన్ మెంట్ ప్రాంతాల్లో జనసంచారం పూర్తిగా నిషేధించాలన్నారు. అన్ని మతపరమైన కార్యక్రమాలపై నిషేధం ఉందని, కాబట్టి ఎవరూ ప్రార్థనల కోసం బయటకు రాకుండా చూడాలన్నారు. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్స్, సినిమా హాల్స్, పబ్బులు మూసే ఉంచాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరమని, పాన్ పరాక్, చూయింగ్ గమ్ నమలడం, గుట్కా అమ్మకాలు నిషేధించినట్టు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి త్వరగా శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో సీపీ కార్తీకేయ, ఏసీపీ రఘువీర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown, central cabinet secretory rajeev gouba, orders to district colleters

Tags:    

Similar News