మహిళలకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన 42 వేల స్వశక్తి సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసింది. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున ఒక్కో సంఘానికి మొత్తం రూ. 15 వేలు విడుదల చేసింది. ఈ సొమ్మును సంఘాలు తమ నిధిని పెంచుకునేందుకు వినియోగించాలని సూచించారు. సంఘంలోని సభ్యులు దీన్ని కనీస వడ్డీకి అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించాల్సి ఉంటోంది. నూతనంగా ఏర్పాటైన మహిళా సంఘాలకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన 42 వేల స్వశక్తి సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసింది. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున ఒక్కో సంఘానికి మొత్తం రూ. 15 వేలు విడుదల చేసింది. ఈ సొమ్మును సంఘాలు తమ నిధిని పెంచుకునేందుకు వినియోగించాలని సూచించారు. సంఘంలోని సభ్యులు దీన్ని కనీస వడ్డీకి అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించాల్సి ఉంటోంది. నూతనంగా ఏర్పాటైన మహిళా సంఘాలకు ప్రోత్సహాకంగా ఈ సొమ్మును ఇచ్చారు.
పంచుకోవద్దు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన రివాల్వింగ్ ఫండ్‌ను సంఘం ఆదాయాభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలని నిబంధనల్లో స్పష్టం చేశారు. అంతకు మినహా సంఘ సభ్యులు ఈ మొత్తాన్ని పంచుకునేందుకు అవకాశం లేదని వెల్లడించారు. దీని నియంత్రణలో భాగంగా మహిళా సంఘాలన్నింటినీ ఆన్లైన్ చేసి, రివాల్వింగ్ ఫండ్‌ను వారి ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ రివాల్వింగ్ ఫండ్‌ను సంఘంలోని సభ్యురాలికి అప్పుగా ఇచ్చే అవకాశం మాత్రమే ఉంటోంది. బ్యాంకు వడ్డీ ప్రకారం తిరిగి వాయిదాల రూపంలో చెల్లింపులు చేసుకోవాలి. అంతేకానీ ఒకేసారి సంఘ సభ్యులు వాటాలుగా పంచుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలోని కొత్త మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐకేపీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కుంట గంగారెడ్డి, ఏపూరి నర్సన్న, సుభాష్, మహేందర్‌రెడ్డితో పాటు మహిళా సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. రాష్ట్రంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లింపుల్లో 98 శాతంతో మన మహిళా సంఘాలు ముందున్నాయని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహాకాలు వస్తున్నాయని వారు తెలిపారు. ఈ రివాల్వింగ్ ఫండ్‌తో మహిళలు ఆర్థికాదాయం పెంచుకోవాలని వారు కోరారు.