రూ.లక్ష కోట్లు అప్పు చేయనున్న కేంద్రం !

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ వసూళ్ల తగ్గుదలలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.1లక్షల కోట్లు అప్పుతీసుబోతున్నట్లు స్పష్టం చేసింది. జీఎస్టీ పరిహారానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాతిపదికన ఈ రుణాలను ఇస్తామని కేంద్రం పేర్కొంది. అయితే, తిరిగి చెల్లింపులకు సంబంధించి అసలు, వడ్డీని ఎవరు కట్టాలనే దానిపై ప్రకటనలో ఎలాంటి వివరాలూ పేర్కొనలేదు. 2017 జులై నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో స్థానిక పన్నులు, వ్యాట్‌లను విధించే […]

Update: 2020-10-15 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ వసూళ్ల తగ్గుదలలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.1లక్షల కోట్లు అప్పుతీసుబోతున్నట్లు స్పష్టం చేసింది. జీఎస్టీ పరిహారానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాతిపదికన ఈ రుణాలను ఇస్తామని కేంద్రం పేర్కొంది. అయితే, తిరిగి చెల్లింపులకు సంబంధించి అసలు, వడ్డీని ఎవరు కట్టాలనే దానిపై ప్రకటనలో ఎలాంటి వివరాలూ పేర్కొనలేదు. 2017 జులై నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో స్థానిక పన్నులు, వ్యాట్‌లను విధించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వదులు కోవడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం అప్పట్లో అంగీకరించింది.

 

Tags:    

Similar News