కరోనా మీద పోరాడి గెలిచిన నగరం!

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లోని భిల్వారా నగరాన్ని కరోనా విషయంలో చైనాలోని వుహాన్ నగరంతో పోల్చారు. మార్చి 20 నాటికి ఈ చిన్న నగరంలో కరోనా విజృంభించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 24 లక్షల మంది నివసిస్తున్న ఈ నగరంలో 27 కరోనా పాజిటివ్ కేసులు, రెండు మరణాలు సంభవించడంతో దీన్ని హాట్‌స్పాట్ పరిగణించి అష్టదిగ్భందనం చేశారు. కానీ రాజస్థాన్, భిల్వారా స్థానిక ప్రభుత్వాలు కలిసి చూపించిన పనితీరు వల్ల గత రెండు వారాల నుంచి ఒక్క […]

Update: 2020-04-08 07:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లోని భిల్వారా నగరాన్ని కరోనా విషయంలో చైనాలోని వుహాన్ నగరంతో పోల్చారు. మార్చి 20 నాటికి ఈ చిన్న నగరంలో కరోనా విజృంభించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 24 లక్షల మంది నివసిస్తున్న ఈ నగరంలో 27 కరోనా పాజిటివ్ కేసులు, రెండు మరణాలు సంభవించడంతో దీన్ని హాట్‌స్పాట్ పరిగణించి అష్టదిగ్భందనం చేశారు. కానీ రాజస్థాన్, భిల్వారా స్థానిక ప్రభుత్వాలు కలిసి చూపించిన పనితీరు వల్ల గత రెండు వారాల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా ఆ 27 పాజిటివ్ కేసుల్లో 13 మంది ఇప్పటికే కోలుకున్నారు. మరి వాళ్లు పాటించిన విధానాలేంటి?

మార్చి 20 నాటికి 27 కేసులు అని తెలియగానే నగరం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించి, ప్రతి ఇల్లు తిరిగి సర్వే నిర్వహించి టెస్టులు చేసి వ్యాధి వ్యాప్తిని అడ్డుకున్నట్లు భిల్వారా కలెక్టర్ రాజేంద్ర భట్ తెలిపారు. జిల్లాతో అన్ని సరిహద్దులు మూసేసి అష్టదిగ్భందనం చేసినట్లు చెప్పారు. 27 కేసుల్లో ఎక్కువగా ఆసుపత్రి సిబ్బంది ఉండటంతో అన్ని హాస్పిటళ్లను హాట్‌స్పాట్లుగా గుర్తించినట్లు తెలియజేశారు.

జిల్లాను ఐసోలేట్ చేయడం, హాట్‌స్పాట్లను గుర్తించడం, డోర్ టు డోర్ సర్వే, కాంటాక్టు ట్రేసింగ్, క్వారంటైన్ ఏర్పాటు చేయడం, గ్రామీణ ప్రాంతాలను మానిటర్ చేయడం వంటి పద్ధతులను తాము అవలంబించినట్లు కలెక్టర్ చెప్పారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 2 వరకు మొత్తం 1937 టీమ్‌లతో 4.41 లక్షల ఇళ్లు తిరిగి సర్వే చేయించారు. ఆ సర్వేలో 14000 మందికి జలుబు వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వాచ్ లిస్టులో పెట్టారు. తర్వాత రోజుకి రెండు సార్లు వీరి లక్షణాలను మానిటర్ చేసినట్లు భిల్వారా సీఎంహెచ్ఓ డాక్టర్ ముస్తఖ్ ఖాన్ తెలిపారు. అలాగే లాక్‌డౌన్ కాలం మొత్తం దిగ్భందనం పాటించి జిల్లాను కరోనా ఫ్రీ చేస్తామని ఆయన అన్నారు. వీరు పాటించిన విధానాలనే భిల్వారా మోడల్‌గా పరిగణిస్తూ కేంద్రం కూడా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags: corona, Covid 19, Isolation, Bhilwara, Rajasthan, Closed, lockdown

Tags:    

Similar News