సోషల్ మీడియా ఉద్యోగులకు బెదిరింపులపై కేంద్రం వివరణ
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సంస్థలలో పనిచేసే ఉద్యోగులను ఎప్పుడూ బెదిరింపులకు గురిచేయలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైతు చట్టాలకు అనుకూలంగా, దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా పలువురు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు పెట్టిన వివాదాస్పద ట్వీట్లు, పోస్టులు తొలగించకుంటే ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలలో పనిచేస్తున్న ఉద్యోగులను జైలుకు పంపుతామని బెదిరించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, […]
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సంస్థలలో పనిచేసే ఉద్యోగులను ఎప్పుడూ బెదిరింపులకు గురిచేయలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైతు చట్టాలకు అనుకూలంగా, దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా పలువురు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు పెట్టిన వివాదాస్పద ట్వీట్లు, పోస్టులు తొలగించకుంటే ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలలో పనిచేస్తున్న ఉద్యోగులను జైలుకు పంపుతామని బెదిరించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, సాంకేతిక వ్యవహారాల (ఐటీ) మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. ‘గతంలో పార్లమెంటులో చెప్పిన విధంగా సోషల్ మీడియా యూజర్లు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. ప్రధాని, ఇతర మంత్రులపైనా విమర్శలు చేయవచ్చు. కానీ హింసను, మత ఘర్షణలను ప్రోత్సహించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే మాత్రం వారిపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం’ అని చెప్పింది.
‘ భారత్‌లో పనిచేసే ఏ సంస్థ అయినా ఇక్కడి చట్టాలకు లోబడి నడుచుకోవాల్సిందే. వాటి మీద ఆ బాధ్యత కూడా ఉంది. అంతేగానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో పనిచేసే ఉద్యోగులను రాత పూర్వకంగా గానీ, మాటల ద్వారా గానీ బెదిరించలేదు’ అని వివరణ ఇచ్చింది